ఈ నెల 19 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు హమారా సౌచాలై-హమారా సమ్మాన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నేపథ్యంలో ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.