ఉపాధ్యాయ లోకం ఈ సమాజానికి మార్గ నిర్దేశకులని జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్
అన్నారు. ఆదివారం జగ్గయ్యపేట, వత్సవాయి మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్స్ ఎంప్లాయిస్ కో- ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరిగిన మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గానికి సొసైటీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుంది అని అన్నారు.