రాష్ట్రం లోని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేసారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జగ్గయ్యపేట సిపిఐ నాయకులు పాత మునిసిపల్ కార్యాలయంలో ఉన్న సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజి శివాజి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.