20 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యాన్ని బలపరుస్తూ నిరుద్యోగులంతా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టభద్రుల నుంచి ఫారం-18 ఓటరు నమోదు పత్రాలను సేకరించి బాపులపాడు ఎమ్మెర్వో నాగభూషణంకు అందజేసినట్లు తెలిపారు.