నాగాయలంకకు చెందిన భృగుమళ్ళ నాగమల్లేశ్వరరావు - వెంకట లక్ష్మీ కనకదుర్గ దంపతులు రూ. 3 లక్షలతో వెండి మండపాన్ని వితరణగా అందజేశారు. ఆదివారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి దాతలు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ సాంబశివరావుకు వెండి మండపం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శివ నాగేశ్వరరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.