మట్టి ఖర్చులకు నగదు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం ఫిట్స్ రావడంతో కాలువలో పడి మృతి చెందిన రజక మహిళా రమణ కుటుంబానికి స్థానిక గ్రామస్తులు రూ. 11, 500 నగదును అందించారు. నిరుపేద కుటుంబమని తెలుసుకున్న స్థానికులు అప్పటికప్పుడు రూ. 11, 500 నగదును సమీకరించి మట్టి ఖర్చులు నిమిత్తం అందజేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు బడే వీరబాబు, గ్రామపంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు పాల్గొన్నారు.