కోడూరు శివారు నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు సస్పెండ్ చేసిన్నట్లు డీఈవో పి. వి. జే. రామారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కోడూరు మండల ఎంఈఓ టివిఎం రామదాసు మంగళవారం తెలిపారు. తమ కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించి, తొడపై కొరికాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కోడూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయినందున ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.