అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వవద్దని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. ఆదివారం కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద పాత్రికేయులతో మాట్లాడుతూ కోడూరు మండలంలో గత కొద్ది రోజులుగా సైబర్ క్రైమ్ నేరగాళ్ల నుంచి అనేక నెంబర్లతో ఫోన్లు చేసి, మీ వివరాలు మీ బంధువుల వివరాలు తెలిపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, దుర్భాష లాడుతున్నారని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.