కోడూరు మండల శివారు హంసలదీవి బీచ్ వద్దకు పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అనేక వాహనాలతో బీచ్ వద్దకు పర్యాటకులు విచ్చేసారు. కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరిస్తూ సరదాగా గడిపారు. పర్యటకులు మెరైన్ పోలీస్ వారి సలహాలు సూచనలు తప్పక పాటించాలని, పిల్లల్ని బీచ్ వద్ద ఒంటరిగా వదలరాదని మెరైన్ సిఐ కిషోర్ రెడ్డి తెలిపారు.