ప్రజా సమస్యల పరిష్కారానికై ఈనెల 8వ తేదీ నుండీ 13వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు తెలిపారు. చల్లపల్లిలోని గుంటూరు బాపనయ్య భవన్లో బుధవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ.. ప్రజాపోరు ప్రచారం అనంతరం 14వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.