ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం అవనిగడ్డ నూతన తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన కె. నాగమల్లేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవనిగడ్డ మండలంలోని సామాన్య ప్రజలకు ఉత్తమ రెవెన్యూ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.