అవనిగడ్డ: నటి కస్తూరి తెలుగు జాతికి క్షమాపణలు చెప్పాలి

70பார்த்தது
అవనిగడ్డ: నటి కస్తూరి తెలుగు జాతికి క్షమాపణలు చెప్పాలి
తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారు తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు తెలుగు జాతికి తీవ్ర అవమానకరం అన్నారు. తమిళనాడును ఏలిన వారు తెలుగు వారని తెలిపారు. రాణి మంగమ్మ మధుర ను పరిపాలించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி