ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడు క్రికెట్ స్టేడియంను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం పరిశీలించారు. స్టేడియంలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మొదటి సారి వచ్చిన ఆయనకు స్టేడియం సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నాయకులు అయనకు సన్మానం చేశారు.