విజయవాడ నగరంలోని వారధి వద్ద సోమవారం కృష్ణానది వరద నీటి ప్రవాహంలో ఉరకలెత్తుతుంది. ఇంకొక రెండు అడుగులు వరద వస్తే కృష్ణలంక మునిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నట్లుగా తెలిపారు.