ఎన్టీఆర్ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్టంగా అమలయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై సమావేశం జరిగింది.