బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఆశీస్సులు అమ్మవారు అందించాలని ఆయన ప్రార్థించారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.