గంపలగూడెం మండలం పెనుగొలను శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం గ్రంథాలయ ఉద్యమం ప్రాముఖ్యత గురించి వివరించారు. గ్రంథాలయ అధికారి జె. శ్రీలత ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు నేటి సమాజంలో గ్రంథాలయాల పాత్ర, డిజిటల్ గ్రంథాలయాల వాటి యొక్క ఉపయోగాలు, మాదక ద్రవ్యాల యొక్క నివారణ అను అంశంలు పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.