దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలు అనిర్వచనీయమని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో అమరుడైన జవాన్ సాదరబోయిన నాగరాజును గుర్తు చేసుకుంటూ పెడనలో వారి కుటుంబాలను ఎస్పీ బుధవారం రాత్రి పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరులైన సాదరబోయిన నాగరాజు త్యాగాలని మరవలేమన్నారు.