పెడన: ప్రభుత్వ వైద్యశాలలో కొరవడిన పారిశుద్ధ్యం

74பார்த்தது
పెడన పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్యం కొరవడింది. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన పెడన పట్టణంలోని వైద్యశాలకు వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలోని బెడ్ల వద్ద సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు బుధవారం పేర్కొన్నారు. కనీసం మరుగుదొడ్లు సైతం సరిగా శుభ్రపరచటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி