పెడన నియోజకవర్గంలోని కమలాపురం బ్రిడ్జి కుంగింది. వడ్లమనాడు నుండి చెన్నూరు రోడ్డు రెండు వైపులా కుంగిపోయింది. ఈ రహదారిపై వేలాది భారీ వాహనాలు వెళ్తున్న క్రమంలో ఈ ప్రాంతంలో క్రుంగిపోయినట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత శాఖ ఆర్ అండ్ బి వారు ఈ సమస్యను పట్టించుకుని మరమ్మత్తులకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.