ముసునూరు: పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ముసునూరు మండలంలో త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి ప్రజలకు హామీ ఇచ్చారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా అక్కిరెడ్డిగూడెం గ్రామంలో 15. 50 లక్షలతో నిర్మించనున్న 5 సిసి రోడ్ల పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం సురేపల్లి, లోపూడి, చెక్కపల్లి గ్రామాలలో సీసీ రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది.