పల్లె ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగలో భాగంగా నందిగామ మండలంలోని అడవి రావులపాడు రూ. 20 లక్షలు, లింగాలపాడులో రూ. 25 లక్షలు, తక్కెళ్ళపాడు గ్రామంలో రూ. 20 లక్షలతో బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఊరూరా వేడుకగా జరిగిన పల్లె పండగ వారోత్సవాలు ముగిశాయన్నారు.