నందిగామ పట్టణంలో గురువారం మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్ ను మెప్మా మహిళలు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ స్టాల్ ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కూటమినేతలు పాల్గొన్నారు. అనంతరం అక్కడున్న వసువులను షాపింగ్ చేశారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు.