నందిగామ పట్టణ పరిధిలో 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం ప్రజా పరిరక్షణ సమితి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక పుస్తకమైనా ఉండాలన్నారు. రాయితీ ధరలపై పుస్తకాలు విక్రయిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.