అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకుమల్లి రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ ఆర్డీవో, నందిగామ మండల తహసిల్దార్ కీ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కన్నెగంటి జీవరత్నం, వైస్ ప్రెసిడెంట్ బలుసుపాటి సురేష్, నందిగామ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, నండ్రు బాబు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.