మైలవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (గర్ల్స్ హైస్కూలు)లో 40 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సౌజన్యంతో దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం కూడా ముఖ్యమన్నారు.