ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మరియు జంపాల సీతారామయ్య గురువారం ఏపీ సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వారికి నిత్యవసర వస్తువుల కిట్లను పూర్తి స్థాయిలో కేటాయించడానికి, పలు సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపించారని అన్నారు.