మృతి చెందిన మహిళా రైతు కుటుంబానికి సొసైటీ ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ నారాయణరావు సతీమణి భారతి ఇటీవల మృతి చెందారు. సొసైటీలో రుణగ్రస్తురాలైన మహిళా రైతుకు సొసైటీ నుంచి రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ సొమ్ము మంజూరైంది.