మచిలీపట్నం నగరంలో పారిశుద్య పరిస్థితులు మెరుగు పరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు డి. కె. బాలజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రతి 10 డివిజన్లకు ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. సదరు నోడల్ అదికారులు తమకు కేటాయించిన డివిజన్లలో ప్రతిరోజు పారిశుధ్య పరిస్థితులు పర్యవేక్షిస్తారన్నారు.