అల్పపీడన ప్రభావంతో రైతులు హడావుడిగా వరి కోతలు ప్రారంభించారు. ఆదివారం మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు యంత్రాల సహాయంతో వరి కోతలు చేపట్టారు. యంత్రాల ద్వారా కోతలకు ఎకరానికి రూ. 2500 నుంచి రూ. 3500 వరకు వసూళ్లు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వాతావరణం మార్పులు చెందడంతో ధాన్యాన్ని ఆరబెట్టుకుని కూలీల సహాయంతో ఇళ్లకు చేర్చుకుంటున్నట్టు రైతులు తెలుపుతున్నారు.