కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గొల్లు కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి గ్రామస్థాయి నుండి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.