క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి
క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండవల్లి జడ్పీహెచ్ స్కూల్ లో మండల స్థాయి ఆటలు పోటీలను అయన ప్రారంభించారు. శుక్రవారం బాయ్స్ టీం, శనివారం గర్ల్స్ టీం ఆటలు పోటీల్లో పాల్గొంటాయాన్నారు. గెలుపొందిన విద్యార్థులు మొదటగా నియోజకవర్గ స్థాయి లో ను, అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి వివిధ పోటీలకు ఎంపిక చేస్తారన్నారు.