జగ్గయ్యపేట పట్టణంలో సుమారు కోటి రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన హైవే బస్టాండ్ నిరుపయోగంగా పడి ఉందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జగ్గయ్యపేట పట్టణం హైవే వద్ద గల హైవే ఆర్టీసీ బస్టాండును స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకతాయిలకు అడ్డాగా మారిందని, ఇక్కడే కూర్చుని మద్యం సేవిస్తున్నట్లుగా మాకు సమాచారం అందిందని తెలిపారు.