ముస్తాబాద నవభారత్ హై స్కూల్ నందు శుక్రవారం రాత్రి రంజాన్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షేక్ ఇమామ్ మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యమని పరమత సహనం అనేది పాటించాలని, అన్ని మతాల వారిని గౌరవించాలని సూచించారు. అందుకోసం పాఠశాల యందు సెమీ క్రిస్మస్, సంక్రాంతి సంబరాలు, రంజాన్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులలో మతసామరస్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు.