ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వారిని చైతన్యపరచాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం. సత్యానందం అన్నారు. చల్లపల్లి చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సోమవారం ఉయ్యూరు డివిజన్ జేఎల్ఎంలకు సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎస్ఈ సత్యానందం మాట్లాడుతూ సౌర విద్యుత్ వాడటం వల్ల వినియోగదారులకు మూడు లాభాలున్నాయని తెలిపారు.