మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య సోమవారం శాసనసభలో ప్రస్తావించారు. తొండంగి మండల పరిధిలో సుమారు 10 వేల వరకు మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయని, వీరిలో ఏడు వేల కుటుంబాలు పూర్తిగా మత్స్యసంపదపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. చేపలవేట నిషేధ సమయంలో వారికి అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 20 వేలకు పెంచాలని కోరారు.