తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ రాజోలు మండలం తాటిపాక సెంటర్ నుంచి హిందువులు శుక్రవారం పాదయాత్ర చేపట్టారు. సెంటర్ లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను చేపట్టారు. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.