రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీభీమేశ్వర స్వామి వారి దేవస్థానం సహాయ కమిషనర్, కార్య నిర్వహణాధికారిణిగా అల్లు వెంకట దుర్గా భవాని శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.