మండపేట మండలం, ద్వారపూడి గ్రామంలో మరిచాయే హెల్త్ కేర్, కాకినాడ వారు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ను ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ లో తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళకు అక్కడి వైద్యులు హెల్త్ చెకప్ చేశారు. అనంతరం మరిచాయే హెల్త్ కేర్, కాకినాడ టీం వేగుళ్ళను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.