పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో జరిగిన సీపీఐ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజమండ్రి 50 వార్డుల్లో ప్రజా ప్రతినిధులు లేక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు.