ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఢిల్లీలో మంత్రిని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు, నాయకులతో కలిసి సమస్యలను వివరించారు. ఆ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.