సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో రెండవ సచివాలయం ప్రాంతంలో వీధి కుక్కలపై విష ప్రయోగం చేయడం వల్ల వీధి కుక్కలు మృత్యువాత పడుతున్నట్లు పలువురు కాలనీ వాసులు సోమవారం అధికారులకు పిర్యాదు చేశారు. నేటి సాయంత్రం నాటికి పది కుక్కలు మృత్యువాత పడ్డాయని, మరో రెండు కుక్కలు అతి క్షీణంగా ఉన్నాయని వారు వాపోయారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, విష ప్రయోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.