తూ.గో: విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. పరిహారం ప్రకటన

65பார்த்தது
తూ.గో: విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. పరిహారం ప్రకటన
తూ.గో. జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ తగిలి నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై సోమవారం సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం విషాదకరమన్నారు.

தொடர்புடைய செய்தி