మండపేట మున్సిపల్ కౌన్సిల్ రిక్విజేషన్ ( అభ్యర్థన) సమావేశం ఈనెల 19న నిర్వహించేందుకు చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి సోమవారం కౌన్సిల్ నోటీసును జారీ చేశారు. సమావేశం నిర్వహించాలంటూ టిడిపి కౌన్సిలర్లు కమిషనర్ రంగారావుకు ఇటీవల లేఖ ఇచ్చారు. టిడిపి అభ్యర్థన, వైసిపి సాధారణ సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు జోక్యంతో అభ్యర్థన సమావేశం నిర్వహించనున్నారు.