ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో కొలువు తీరిన పురాతన మూలేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం రెండవ సోమవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఈ ఆలయం వద్ద స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఆలయ ప్రదర్శనలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ స్వామి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.