కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాల ఆధ్వర్యంలో నవంబర్ 26న జరిగే ర్యాలీ సభలను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్, చెక్కల రాజ్ కుమార్, తాళ్ళారి రాజు, ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.