తమ సమస్యలు పరిష్కరించాలని గోపాలపురం మండల ఆశా వర్కర్లు విన్నవించారు. ఈ సందర్భంగా అన్నదేవరపేట వైద్యులు స్వర్ణలతకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు. వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీత భత్యాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు.