అయినవిల్లి మండలంలో పలు చోట్ల శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. దీంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. విజయదశమి కావడంతో పలు ఆలయాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు వర్షం నీటితో అధ్వానంగా తయారయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.