కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు ఆదివారం గునుపూడి నల్లం వారి కళ్యాణ మండపంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమవరం అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి సహకారం కావాలని కోరారు. భీమవరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తే దానికి కావలసిన భూమిని సేకరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అనంతరం వారిద్దరిని సత్కరించారు.