కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్‌పై వేటు పడింది. సోమశేఖర్ నకిలీ ధృవపత్రాలు ఇచ్చి ఉద్యోగం పొందడం, ఆ తర్వాత పదోన్నతులు పొందినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో అధికారులు విచారణ జరిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఎస్ఎస్. గణేశ్ గురుకుల్‌ను ఆలయ ఇన్‌ఛార్జ్ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.